దానికి సరే… ! కాని గర్భం అంటే భయం!

యువతులకు జంటలవుతామంటే...ఆనందం. కానీ గర్భం ధరించటం అంటే కొంతమందికి చచ్చేటంత భయం. కాని గర్భం ధరించటానికి భయం అవసరం లేదని అది ఒక మానసిక భావన మాత్రమేనని మానసిక నిపుణులు చెపుతారు. మరి ఈ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి. కొత్తగా పుట్టే బిడ్డను ఎలా ఆనందించాలి ? అనే అంశాలు చూడండి.

గర్భం ధరించడమనే భయాన్ని టోకోఫోబియా అంటారు. కొంతమందికి పాములంటే, బల్లులంటే భయం. ఇది కూడా అటువంటి అర్ధం లేని భయమే. కొంతమంది మహిలలు తమకు 40 సంవత్సరాల వయసు వచ్చేవరకు గర్భాన్ని వాయిదా వేస్తూనే వుంటారు. కొంతమందికి ప్రాణ భయం వుంటే...చాలా మందికి మరల తమ శారీరక అందం తిరిగిరాదనే బెంగ కూడా వుంటుంది. మరి కొందరికి అమ్మ అయితే...తమ పార్టనర్ ఇక ఇష్టపడడని లేదా పుట్టబోయే బేబీ తమ జీవన శైలి మార్చేస్తుందని కూడా భయపడతారు.

దీనికంతటికి పరిష్కారం...సరైన సలహాలు కావాలి.
ఇక్కడే...సరిగ్గా మీ భర్త లేదా బాయ్ ఫ్రెండ్ సహాయం ప్రధానంగా అవసరమవుతుంది. గర్భ ధారణ నుండి బిడ్డ పెరిగి పెద్దవాడయ్యేటంత వరకు ఆమెకు పురుషుడు అండగా వుండి అన్ని అంశాలలోను ధైర్యం కలిగించాలి. బిడ్డలు పుట్టి సంతోషంగా వున్న వారిని ఉదాహరణలుగా చూపాలి. పుస్తకాలు, టెలివిజన్ ఛానెల్స్ మొదలైన వాటిద్వారా అందులోని వారు అనుభవిస్తున్న ఆనందాలను వివరించాలి. గర్భం ధరించటమనే భయం అర్ధం లేనిదని, అదే కనుక శరీరానికి చెడును కలిగించేది అయితే, కోట్లాదిమంది పిల్లలను కనటానికి ఎందుకు సిద్ధ పడతారనే లాజిక్ తో వివరణ నిచ్చి ఆమె భయాన్ని పోగొట్టాలి. గర్భవతి అయిన దశ నుంచి తల్లి దశ వరకు గల ఆనందాలను ఆమె అనుభవించేలా చేయాలి.

Leave a Reply