విలువలకు పట్టం కట్టాలి

ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ, వ్యాపారీకరణ.. వంటివి విద్యారంగంలో పెనుమార్పులు తీసుకువచ్చి విద్యయొక్క అర్థానే్న మార్చివేసాయ. విద్యను రెండురకాలుగా నిట్టనిలువునా చీల్చివేసాయ. అవి వరుసగా విలువలతో కూడిన లేదా నాణ్యతగల విద్య మరియు విలువలులేని లేదా నాణ్యతలేని విద్య. 1990సంవత్సరానికి ముందు ఇలాంటి పదాలు ఎప్పుడూ వినబడేవికావు. ఎప్పుడైతే విద్య అంగడి సరకుగా మారిందో ఫక్తు వ్యాపార ప్రకటనలకే వేలు, లక్షలు, కోట్లు కేటాయించడం మొదలైందో అప్పటినుండి విద్యారంగంలో పతనం ప్రారంభమైంది. మానవీయ విలువలకు మారుపేరుగా నిలబడి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపులై సమాజానికి మార్గదర్శి కావలసిన నేటి అనేకమంది ఉపాధ్యాయులు ఆదర్శాలను తుంగలో తొక్కుతూ వృత్తిని పాడిగేదెలా భావిస్తూ కేవలం జీతాలకోసమే పనిచేస్తున్నారు. ఉపాధ్యాయుడికి ఉండవలసిన లక్షణాలను, లక్ష్యాలను ఏమాత్రం లెక్కించక ఇదొక అతి సులభమైన సంపాదనామార్గంగా భావించి వక్రమార్గంలో సర్ట్ఫికెట్లు పొందుతూ ప్రమోషన్లు పొందడం కొనసాగుతోంది. ఈ అవినీతి రానురాను ఉద్యోగ నియామకాలల్లో గూడ చొరబడే ప్రమాదం దాపురించింది.
విద్యాధికారులు విద్యాప్రమాణాలను నిర్లక్ష్యంచేస్తూ కేవలం పదవ తరగతి ఫలితాలపై దృష్టిసారిస్తూ పదే పదే 100% ఫలితాలకై జపంచేయడంవల్ల ప్రతి ఉపాధ్యాయుడు ఫలితాలకై అతి సులభమార్గమైన వార్షిక పరీక్షల్లో ఆఖరి క్షణంలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానాలుచెప్పి ఉన్నత విద్యాధికారులు ఆశించిన ఫలితాలు తీసుకురావడంలో కృతకృత్యులవుతున్నారు. ఇటువంటి దుర్ధశలో ఉన్న పాఠశాలల్లోకి వ్యక్తిత్వ వికాస నిపుణులు వచ్చి ఒకపూట లేదా రెండుమూడుగంటలు శిక్షణతో ఏకాగ్రత పేరున, జ్ఞాపకశక్తి పేరున, మంచి ఆరోగ్యంపేరున, మానసిక ప్రశాంతం పేరున ఇంకా అనేక శీర్షికల పేరున, చక్కని చేతి రాత పేరున పాఠశాలల స్ఫూర్తిని అవహేళనచేయడం జరుగుతున్నది. కార్పొరేటు వర్గ ప్రయోజనాలు కాపాడే దినపత్రికలు ఆయా జిల్లాల ఎడిషన్లలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలను హైలెట్‌చేస్తూ పత్రికలస్థాయిని దిగజారుస్తున్నాయ. టీచరు సైడు దందాలకెళ్లకుండా టీచరుగానే ఉంటే వ్యక్తిత్వవికాస నిపుణుడు, మానసిక వైద్యుడు, సామాజిక ఇంజనీరు, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క చెల్లి, మిత్రుడు అన్ని పాత్రలు పోషిస్తూ విద్యార్థి అసలైన వికాసానికి నిత్యం కృషిచేయగలడు. విద్యార్థుల్లో ఆశించిన మార్పును తీసుకురాగలడు. అవలక్షణాలకు దూరంగావున్న ప్రతి ఉపాధ్యాయుడూ అసలైన వ్యక్తిత్వ వికాస నిపుణుడు అన్న సంగతి మరవొద్దు. మానవీయ విలువలకు మారుపేరుగా ప్రతి ఉపాధ్యాయుడు నిలవాల్సిన తరుణమిది. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుడు నిజాయతీగా కృషి చేసినట్టయతే..్భవితరాల గురించి ఆందోళన వ్యక్తం కాబోదు.కానీ ఫలితాలనే దృష్టిలో పెట్టుకొని విషయావగాహనకు కాకుండా, అవసరమైన ముఖ్యాంశాలను గుర్తుంచుకునే విధానాన్ని అనుసరిస్తుండటం వల్ల, విద్యార్థులకు పాఠ్యాంశంలోని అసలు భావం అర్థంకావడం లేదు. అందువల్ల ఒక ప్రశ్నకు తాను రాస్తున్న సమాధానాన్ని అవగాహనతో కాకుండా, పరీక్ష పాసవడం లేదా ర్యాంకు సాధన దృక్కోణంతోనే విద్యార్థి చూస్తున్నాడు. అందుకు వారిని కాదు.. కేవలం ఉపాధ్యాయులు, వారిపై ఫలితాలు సాధించాలంటూ వత్తిడి తెస్తున్న పై అధికారులను మాత్రమే నిందించాల్సి ఉంటుంది. విద్య ప్రైవేటీకరణ వల్ల ప్రైవేటు ఉపాధ్యాయు ర్యాంకులనే యాజమాన్య వ్యాపార ఒరవడిలో కొట్టుకుపోతుండగా, ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రం అసౌకర్యాల మధ్య, ఎటువంటి సృజనాత్మకత లేకుండా పాఠాలను చెబుతూ రొటీన్‌గా కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో విలువలతో కూడిన విద్య లభించేదెట్లా?

Leave a Reply