‘టేకిట్ ఈజీ పాలసీ’ మేలు

మనిషి ఎమోషనల్‌గా ఫీలైనప్పుడు మానసిక సంచలనం లేదా ఎక్సయిట్‌మెంట్ కలుగుతాయి. దీనివల్ల మానసికంగా, శారీరకంగా అనేక మార్పులు జరుగుతాయి. మనిషిలో కొన్ని వందల రకాల ఎమోషన్స్ ఉండొచ్చు. అయితే ప్రధానంగా వాటిని మానసిక నిపుణులు ఎనిమిది రకాలుగా విభజించారు. అవి 1.ఆవేశం 2.దుఃఖం 3.్భయం 4.సంతోషం 5.ప్రేమ 6. ఆశ్చర్యం 7.అసహ్యం 8. కోపం. ఆనందం, పొగడ్తలకు పొంగిపోవటం, రిలాక్స్ కావడమనేవి సంతోషమనే ఎమోషన్‌కి సంబంధించినవి. సాధారణంగా పోల్చటం, రెచ్చగొట్టబడటం అనే రెండు పద్ధతుల ద్వారా విద్యార్థి ఎమోషన్స్ అదుపు తప్పే అవకాశముంది. ఇతరులవైపు నుండి అలాంటి ప్రమాదం ఉండటమే కాక, తనవైపు నుండి సహజ సిద్ధంగా పుట్టుకొచ్చే భయం లేదా బాధనుండి కూడా విద్యార్థి ఎమోషనల్‌గా ఫీల్ అవడం జరుగుతూ ఉంటుంది. ఒక విద్యార్థికి రెండు శాతం మార్కులు తగ్గితే, ఎక్కువ శాతం మార్కులు వచ్చిన విద్యార్థితో పోల్చి ‘నువ్వు వేస్టురా’ అనడం జరుగుతుంది. ఈ మాట ఆ విద్యార్థిని గాయపరుస్తుంది. ఇతరులతో పోల్చడం వల్లనైతేనేమి, రెచ్చగొట్టడంవల్లనైతేనేమి విద్యార్థిలో బాధ కలుగుతుంది. ఈ ఎమోషన్స్ అధిక స్థాయిలో ఏర్పడితే అది అనర్థదాయకం అవుతుంది.
జీవితమంటే కేవలం పరీక్షలో పాస్ కావడమే కాదని అర్థం చేసుకోవాలి. ఈ విధమైన ఆలోచనా విధానంతో మనల్ని మనమే మార్చుకోవడానికి అద్భుతమైన పద్ధతి ఉంది. అదే... టేకిట్ ఈజీ పాలసీ. మానసిక శాస్తవ్రేత్తల పరిభాషలో చెప్పుకోవాలంటే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే ఎమోషనల్ కోషియంట్ అనవచ్చు. అవతలవారిని అర్థం చేసుకోవడంవల్ల వ్యక్తి దృక్కోణం విశాలమవుతుంది. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే వారు మీనుండి ఏం కోరుకుంటున్నారో తెలుస్తుంది. ఎమోషన్స్‌ని అర్థం చేసుకుంటే అసలు సమస్య ఏమిటనేది మీకు అర్థమవుతుంది. దాంతో సమస్య పరిష్కారం కోసం చర్చలు జరగటం, తద్వారా సమస్య పరిష్కారం చాలా సులభమవుతుంది. అర్థం చేసుకునే గుణం వల్ల ఆవేశకావేశాలకు తావుండదు. అనర్థాలూ జరగవు. మానవతా దృక్పథం, సున్నిత మనస్తత్వం, సునిశిత పరిశీలనా శక్తి అవతలి వ్యక్తిని అర్థం చేసుకోవడంవల్లనే అలవడుతాయి. కష్టపడి విజయం సాధించాలనే ఆలోచన కలుగుతుంది. మన కర్తవ్యాన్ని మనం సిన్సియర్‌గా నిర్వహించాలి. ఎదుటివారు మననుండి ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకుని, వారి కోరికలకు అనుగుణంగా మారడం లేదా సమస్యను వారితో చర్చించడం చేయాలి. అంతే తప్ప పెద్దల మాటలు, చేష్టలను మరోలా భావంచి బాధపడటం సబబు కాదు. అది ‘సక్సెస్’కి అనుకూలించే అంశమూ కాదు. సక్సెస్ సాధించాలంటే సమస్యలను ఈజీగా తీసుకుని, ఆ తర్వాత ఆలోచించి అడుగేయాలి. టేకిట్ ఈజీ పాలసీ అంటే ఇదే.

Leave a Reply