ఘనంగా సత్యసాయి జయంతి

నెల్లూరు, నవంబర్ 18: నగరంలోని సుబేదారుపేట ప్రాథమిక పాఠశాలలో కేతా అంకులు మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకుడు కేతా సుబ్బారావునేతృత్వంలో సత్యసాయి 87వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆశుకవి గుడి నారాయణబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్తవ్యం, క్రమశిక్షణ అలవర్చుకుంటే సమాజంలో ఉన్నతులుగా ఎదగొచ్చన్నారు. కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరైన శేషయ్యనాయుడు మాట్లాడుతూ ధనం కంటే కీర్తి ప్రధానమని పేర్కొన్నారు. కళాకారుడు గండికోట రామకృష్ణ వైద్యఖర్చులకు రెండువేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బాలాజీ ఆర్కెస్ట్రా సత్యసాయి గీతాలాపన చేసి అందరినీ అలరించారు. కార్యక్రమంలో ఇంకా దుర్గం మధుసూదన్, ప్రభావతమ్మ, మంగళ గౌరి, రవికుమార్, టి సుధాకర్, అమరా సుబ్బారావు, బాలమ్మ, పద్మనాభరావు, కెఎస్ మూర్తి, ప్రభృతులు సత్యసాయిపై భక్తిగీతాలాపన చేశారు.

సింహపురి సాహితీ సమాఖ్య వార్షికోత్సవం
నెల్లూరు, నవంబర్ 18: సింహపురి సాహితీ సమాఖ్య వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక జడ్పీ సభా మందిరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడపకు చెందిన యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆచార్యులు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు ఉదయకుమార్‌లకు విశిష్ట పురస్కారాలు అందజేశారు. రచయతలు 30 మందికి పురస్కారాలు, కవి సమ్మేళనంలో పాల్గొన్నందుకు జ్ఞాపికలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి సమాఖ్య అధ్యక్షులు గణపం రాజగోపాల్‌రెడ్డి అధ్యక్షత వహించగా, సింహపురి సాహితీ సమాఖ్య ఉపాధ్యక్షులు సిరిమామిళ్ల కోటేశ్వరరావు ఆయన తండ్రి జ్ఞాపకార్ధం జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఆచార్య ఆదిత్య, జాలె వాసుదేవనాయుడు, ఊరిబిండి వెంకట సుబ్రహ్మణ్యశాస్ర్తీ, డాక్టర్ చక్రవర్తి, మల్లిఖార్జున, మురళీధర్, పి జయప్రద, ఆలూరు శిరోమణిశర్మ, సర్వేపల్లి రామ్మూర్తి, సినీ నిర్మాత శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply