ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు మన పెద్దలు. అంటే ఇంటి తీరుని బటి ్ట ఆ ఇంట్లో వారి మనస్తత్వాలు ఇట్టే అంచనా వేయవచ్చన్నది పెద్దల ఆలోచన. వెనకటి రోజుల్లో గోడలకు సున్నం వేయించడమే పెద్ద అలంకరణ. అట్లాంటిది ఇప్పుడు గోడలకు వేల రూపాయలు వెచ్చించి రకరకాల రంగులు వేయటంతోపాటు ఇతర అలంకరణకు లక్షల రూపాయలు వెచ్చిస్తుండటం ప్రస్తుత స్థితిని అద్దం పడుతోంది.
ఇప్పుడు ఇంటి అలంకరణలో పూర్తిగా పాశ్చాత్య సంస్కృతి చోటు చేసుకుంది.
మోడరన్ ఆర్ట్ కేన్వాస్లు నివాస గృహాలతో పాటు, వాణిజ్య, వ్యాపార కేంద్రాలు, కార్యాలయాల గోడల మీద దర్శనమిస్తాయి. ఆర్ట్ కేన్వాస్ల ఎంపిక ముందస్తు ప్రణాళికతో చేసుకుంటే యజమానులు, అతిథులకూ ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఏదో ఒకటిలే అని కొనేసి తగిలిస్తే తలనొప్పి పుట్టిస్తాయంటే అతిశయోక్తి కాదు. గది గోడలకు వేస్తున్న రంగులను బట్టి ఆర్ట్‌ను ఎంపిక చేసుకోవాలి. వీటన్నింటికి తోడు మన అభిరుచి ఆర్ట్‌లో ప్రతిబింబించాలి. అందుకే ఆర్ట్ కేన్వాస్లను కొనేముందు వాటిని ఎక్కడ వేలాడదీయాలనుకుంటున్నారో తేల్చుకోవాలి. ఎన్నింటిని ప్రదర్శించాలి, ఎంతపొడ వు వెడల్పు ఉంటే బాగుంటుందో కూడా ముందే అంచనా వేసుకోవాలి.
ఎక్కడి బొమ్మలు అక్కడే
చిత్రాలను వేలాడదీయాల్సిన ఆయా ప్రదేశాలను బట్టి ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవాలి. లేకపోతే ‘వీడికి బొత్తిగా కళాభిరుచి లేదే’ అంటూ పెదవి విరుస్తారు. వంట గదిలో తాజాగా కన్పించే పండ్లు, కూరగాయలు తదితర తినుబండారాల చిత్రాలను వేలాడదీయాలి. ఆహార పదార్థాలకు ఉండాల్సిన తాజాదనాన్ని ఎప్పడూ గుర్తు చేస్తుంటుంది కూడా. కొందరికి జంతువల చిత్రాలు అంతగా నప్పవు. దీనికి తోడు మాంసాహార సంబంధిత బొమ్మలు కూడా కొందరికి రుచించవు. అందుకే చిత్రాల ఎంపిక ఆలోచించి తీసుకోవాలి. అదే ముందు గదిలోనయితే ప్రకృతి చిత్రాలు, పడకగదిలో ఊహా చిత్రాలు, పిల్లల గదుల్లో జంతువుల, పక్షుల చిత్రాలు, వృద్ధులు ఉండే గదుల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడే చిత్రాలు వేలాడదీయవచ్చు.
కార్యాలయాల్లో అతిథులు వేచి ఉండే చోట చూడగానే వెంటనే అర్థంకాని చిత్రాలను అంటే మోడరన్ ఆర్ట్‌ను ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
వాటిని చూసీ చూడకముందే ఆ కార్యాలయ నిర్వాహకుడిపై అతిథులు ఒక అంచనాకు రాకూడదన్నమాట. అధునాతన చిత్రాన్ని అర్థం చేసుకునే పనిలో అతిథి మునిగిపోతే విసుగు పుట్టకుండా కాలం వెళ్లదీసే అవకాశం ఉంటుంది. దీనికితోడు మోడరన్ ఆర్ట్ అంటే అత్యధికులు గొప్పగా భావిస్తుంటారని గుర్తుంచుకోవాలి. కార్యాలయం గోడలకు వేలాడుతున్న మోడరన్ ఆర్ట్‌కు ఇచ్చేంత గౌరవాన్ని దానికి సంబంధించిన వారు కూడా అతిథుల నుంచి అందుకుంటారు.
తేలికపాటి వర్ణం ప్రశాంతతకు ప్రతిబింబం..
సున్నితమైన రంగులయితే మానసిక ప్రశాంత కలుగచేస్తాయి. ముదురు రంగులు మనస్సును అల్లకల్లోలం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. రంగుల్లోనూ తెలుపు, నీలం, చిలకాకుపచ్చ, పసుపు రంగులు మృదువుగా కనిపిస్తాయి. ఎరుపు, ముదురు ఆకుపచ ్చ, నలుపు రంగులు కంటిని సైతం బెదరగొడతాయి. తేలికపాటి రంగులను ఎంపిక చేసుకోవడం మంచిదేగానీ, గోడ రంగులో చిత్రాలు కలిసి కనపడకుండాపోయే ప్రమాదం ఉంటుంది.