చిన్నారుల్లోనూ యాంగ్జయిటీ…

');
winprint.document.close();
winprint.focus();
winprint.print();
winprint.close();
}

function printPage() {
window.print();
}


   

ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం, స్మగ్లర్ల ఆచూకీ, నిల్వలపై ఆరాకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు: ఏపీ డీజీపీ జేవీరాముడు     |     హైదరాబాద్: ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు టీవీఎస్‌, టీవీవీ ఆందోళన     |     హైదరాబాద్: కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో ఎంఆర్‌ ల్యాబోరేటరీలో భారీ శబ్దంతో పేలుడు, భయంతో పరుగులు తీసిన సిబ్బంది, స్థానికులు     |     మహబూబ్‌నగర్‌: తిమ్మాజిపేట మం. మరికల్‌లో ముగ్గురు కూతుళ్లుసహా నిప్పంటించుకుని తల్లి ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం     |     నల్గొండ: శ్రీనివాసనగర్‌ కాలనీలో అదృశ్యమైన విద్యార్థినులు క్షేమం, ఒడిశా పోలీసుల అదుపులో విద్యార్థినులు ప్రణీత, పావని     |     రంగారెడ్డి: ఘట్‌కేసర్ మం. ఎన్‌ఎఫ్‌సీనగర్‌లో దొంగల బీభత్సం, దంపతులను బెదిరించి 7 తులాల బంగారం, 20 తులాల వెండి, బైక్, రూ.15 వేలు అపహరణ     |     హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.3 లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో నిందితుల గుర్తింపు     |     వరంగల్‌: బచ్చన్నపేట మం. కట్కూరులో పురుగుమందు తాగి మహిళా రైతు లక్ష్మి ఆత్మహత్య, ఆర్థిక ఇబ్బందులే కారణం     |     ప్రకాశం: దర్శి ఆంధ్రాబ్యాంక్‌లో అగ్నిప్రమాదం, కంప్యూటర్లు, ఫైళ్లు దగ్ధం     |     కృష్ణా: జగ్గయ్యపేట క్రాస్‌రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా, ఒకరు మృతి, 11 మందికి గాయాలు, విజయవాడ నుంచి

హైదరాబాద్‌ వెళుతుండగా ఘటన     |     Please send feedback to feedback@andhrajyothy.com     

Andhra Jyothi


Archive
   |    ABN Live   |   

EPaper
   |    Navya Weekly   |   
Education Portal    |   

Sitemap
  


Andhra jyothi


 హోం


నవ్య







యాంగ్జయిటీ సమస్య టీనేజర్లకే ఎక్కువగా ఉంటుందని అనుకుంటాం. కానీ ఈ సమస్య చిన్నారులను కూడా వేధిస్తోందంటున్నారు మానసిక నిపుణులు. బడికి వెళ్లడం మొదలుపెట్టినప్పటి నుంచి పరీక్షలు, హోంవర్కుల ఒత్తిడి పిల్లల మీద బాగా పెరుగతోందని, అది వారిలో యాంగ్జయిటీని పెంచుతోందని వారు హెచ్చరిస్తున్నారు. మూడేళ్ల వయసు చిన్నారులు సైతం యాంగ్జయిటీతో బాధపడుతున్నారని వారు చెప్పారు. తనకు బడికి వెళ్లాలని లేదని, కడుపులో నొప్పిగా ఉందని, తలనొప్పిగా ఉందని పిల్లలు అంటే వాటిని తేలిగ్గా కొట్టిపారేయవద్దని కూడా మానసిక నిపుణులు అంటున్నారు. మెల్లగా పిల్లల్ని మాటల్లో పెట్టి వారి సమస్య ఏమిటో తెలుసుకోవాలని చెప్తున్నారు. టీనేజర్లలో కనిపించేంత స్థాయిలో చిన్నారుల్లో ఈ సమస్య ఉండకపోయినా ఇదీ అని చెప్పలేని ఆందోళన మాత్రం ఈ వయసు పిల్లలను వెన్నాడుతుంటుందంటున్నారు. అదే చివరకు యాంగ్జయిటీకి దారి తీస్తోంది.
పిల్లలు అలాంటి పరిస్థితి పాలబడకుండా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించుకుంటుండాలంటున్నారు. పిల్లల్లోని భావోద్వేగాలను, ఆందోళనలను అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులు ప్రయత్నిస్తే వారెదుర్కొంటున్న అసలు సమస్య ఏమిటో అర్థమవుతుంది. పిల్లల మనసు తేలిగ్గా, స్వేచ్ఛగా ఉండేలాగ తల్లిదండ్రులు వారితో మనసు విప్పి మాట్లాడాలి. వారి మనసులోని, ఆందోళనలు, భయాలు ఏమిటో తెలుసుకోవాలి. వారితో స్నేహంగా మెలగాలి. వారి భయాలు అర్థంలేనివని హేతుబద్ధంగా పిల్లలకు చెప్పడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలని మానసిక నిపుణులు చెప్పారు. తాము వారి వైపే ఉన్నామన్న భావనను పిల్లల్లో పెద్దవాళ్లు కలిగించాలి. పిల్లల మనసు లోలోతుల్లో దాగున్న భయాలు ఏమిటో తెలుసుకుని వాటిని పోగొట్టే ప్రయత్నం చేయాలి. అలాగే తల్లిదండ్రులు కూడా తమలోని యాంగ్జయిటీని బయటకు ప్రదర్శించకుండా నిబ్బరంగా వ్యవహరిస్తే తమ పిల్లలు యాంగ్జయిటీ సమస్య పాలబడకుండా కాపాడుకోగలరు. పెద్దవాళ్లు కొన్నిసార్లు తమ ఉద్యోగ ఒత్తిళ్లను, చికాకులను పిల్లల మీద చూపుతుంటారు. చదువులో మార్కులు తక్కువొచ్చినా కోపగించుకుంటుంటారు. తల్లిదండ్రుల ఈ ప్రవర్తన చిన్నారుల మనసులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లల ఎమోషనల్‌ హెల్ద్‌ను కాపాడడంలో తల్లిదండ్రులెప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. పెద్దవాళ్లల్లాగ అనుభవాల్లోంచి పాఠాలు నేర్చుకునే పరిణతి పిల్లల్లో ఉండదు. తమలోని యాంగ్జయిటీని వారంతట వారు తగ్గించుకోలేరు. పిల్లల్లో యాంగ్జయిటీ సమస్య ఎక్కువయితే తరచూ ఏడవడం, తల్లిదండ్రులను పట్టుకుని వదలకపోవడం, సరిగా నిద్రపోకపోవడం వంటివి చేస్తారు. ఇలాంటి సందర్భాలలో ఆ చిన్నారులకు కావాల్సింది ప్రొఫెషనల్‌ కౌన్సిలింగ్‌ అని తల్లిదండ్రులు గ్రహించాలి.

Related News

  

Best Viewed In Internet Explorer 8+, Mozilla Firefox 4 +, Google Chrome 10+, Safari
5+, Opera 11.5+

Open all references in tabs: [1 - 9]

Leave a Reply